- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌కు హైదరాబాద్ జట్టు కొత్త ఉత్సాహంతో సిద్ధమవుతోంది. భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ). 2026-27 సీజన్‌లో హైదరాబాద్‌కు సిరాజ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చామా మిలింద్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అక్టోబర్ 11 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో త్రిపురతో హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్ ఎలైట్ గ్రూప్-బిలో ఉంది. సౌరాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అసోం, త్రిపుర ఈ గ్రూపులో ఉన్నాయి.
- Advertisement -


