Saturday, September 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దావిద్ రాజ్ ను సన్మానించిన సర్పంచ్ బండిస్వామి

దావిద్ రాజ్ ను సన్మానించిన సర్పంచ్ బండిస్వామి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన ఇందారపు రాజేశ్వరి-రవిందర్ దంపతుల కుమారుడు ఇందారపు దావిద్ రాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ (ఐఏఆర్ఈ) కళాశాలలో సైబర్ సెక్యూరిటీ విభాగంలో బీటెక్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా కళాశాలలో ఇటీవల నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో సైబర్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం గ్రామ బండి స్వామి దావిద్ రాజ్ ను శాలువాతో సత్కరించారు. భవిష్యత్ లో మరిన్ని ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఇందారపు చెంద్రయ్య, కేశారపు చెంద్రయ్య, ప్రభాకర్, ఎమ్మార్పీఎస్ నాయకుడు కేశారపు నరేశ్, నారమళ్ల ఎర్రపొచాలు, జంగం పొచయ్య, కొలుగురి పొచయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -