Wednesday, April 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంక్రైస్తవుల సంక్షేమానికి రూ.88.55 కోట్లు మంజూరు

క్రైస్తవుల సంక్షేమానికి రూ.88.55 కోట్లు మంజూరు

- Advertisement -

6 నెలల్లో రూ.40.94 కోట్లు ఖర్చు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

క్రైస్తవుల సంక్షేమానికి కేటాయించిన నిధులను ఖర్చు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ కనబరుస్తోంది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి మహ్మద్‌ అజహరుద్దీన్‌ నేతృత్వంలో 6 నెలల్లో వివిధ సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన నిధుల్లో దాదాపు సగం నిధులను ఖర్చు చేసినట్టు అధికారులు తెలిపారు. గతంలో మాదిరిగా కేటాయింపులకే పరిమితం కాకుండా కచ్చితంగా ఆ వర్గం సంక్షేమం కోసం వాటిని వెచ్చించాలని మంత్రి ఆదేశించిన నేపథ్యంలో 6 నెలల్లో ఈ నిధులను ఖర్చు చేశారు. క్రైస్తవుల సంక్షేమానికి గతేడాది రూ.88.55 కోట్లు కేటాయించగా, ఆరు మాసాల్లో రూ.40.94 కోట్లను ఖర్చు చేశారు. చర్చిల అభివృద్ధి, క్రిస్మస్‌ వేడుకలు, యువతకు ఉపాధి, మహిళా సాధికారత, శిక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి పలు రకాల కార్యక్రమాలు, పథకాల కోసం ఈ నిధులు విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు, విందు కార్యక్రమాల కోసం రూ.33 కోట్లను విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలో క్రిస్మస్‌ సందర్భంగా4,249 చర్చిలకు వైట్‌వాషింగ్‌, లైటింగ్‌ కోసం రూ.12.75 కోట్లు మంజూరునిచ్చారు. జీహెచ్‌ఎంసీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో 400 కేంద్రాల్లో క్రిస్మస్‌ విందు కార్యక్రమాలను నిర్వహించారు. 5 వేల మంది నిరుద్యోగ క్రైస్తవ యువతకు స్వయం ఉపాధి కోసం రాజీవ్‌ యువ వికాసం పథకంలో దాదాపు 4,980 ఆన్‌లైన్‌ దరఖాస్తులు అందాయి. 1,465 మంది యువతకు ప్లేస్‌మెంట్‌ ఆధారిత ఉపాధి శిక్షణ కోసం 2.68 కోట్లు మంజూరు చేశారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద క్రైస్తవ మహిళలకు ఉచిత కుట్టు యంత్రాలు ఇవ్వాలని నిర్ణయించి అందులో 824 మంజూరు చేయగా 685 యంత్రాలు అందజేశారు.
చర్చిల నిర్మాణం, మరమ్మతుల కోసం సహాయాన్ని కొనసాగిస్తున్నారు. 169 సంక్షేమ ప్రతిపాదనలు సిద్ధం చేసి పెండింగ్‌ పనులను పూర్తి చేసేందుకు 13.18 కోట్లను వెచ్చిం చనున్నారు. 14 కొత్త చర్చి నిర్మాణ ప్రతిపాదనలు రూ.17.02 కోట్లతో ఆమోదం పొందాయి. 10 ప్రాంతాల్లో 42.21 ఎకరాల ప్రభుత్వ భూమి క్రైస్తవ సమాధి స్థలాలకు కేటాయించారు. వాటి అభివృద్ధి పనులకు రూ.3.62 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. క్రైస్తవ భవన్‌కు రూ.10 కోట్లు మంజూరు. ఉప్పల్‌లో కొనసాగుతున్న నిర్మాణ పనులకు రూ.3.50 కోట్లను విడుదల చేశారు. రూ.69 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ క్రైస్తవ కాంప్లెక్స్‌ను ప్రతిపాదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -