Wednesday, April 22, 2026
E-PAPER
Homeక్రైమ్ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో రామచంద్ర నాయక్‌

ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో రామచంద్ర నాయక్‌

- Advertisement -

– జనన ధ్రువీకరణ పత్రం జారీకి లంచం
నవతెలంగాణ-నారాయణపేట

నారాయణపేట ఆర్డీవో రామచంద్ర నాయక్‌ మంగళవారం రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. జనన ధ్రువీకరణ పత్రం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి సుమారు ఐదు నెలల నుంచి ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. చివరకు ఒక జనన ధ్రువీకరణ పత్రానికి రూ.7,500 ఇవ్వాలని ఆర్డీఓ రామచంద్ర నాయక్‌ అడిగారు. దాంతో సదరు వ్యక్తి రూ.5వేలు ఇస్తానని, ఐదు జనన ధ్రువీకరణ పత్రాల కోసం రూ.25వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు బాధితుడు మంగళవారం ఆర్డీఓకు రూ.25వేల లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. ఆర్డీవో కార్యాలయంలో, బాబా కాలనీలోని ఆర్డీవో నివాసంలో ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -