– 1.311 కిలోల గంజాయి స్వాధీనం
నవతెలంగాణ – ముషీరాబాద్
అక్రమంగా హైబ్రిడ్ గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 1.311 కిలోల హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ నామాలగుండు ప్రాంతానికి చెందిన రోషన్సింగ్ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం అతను బైక్పై వెళ్తుండగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు అతడిని పట్టుకుని విచారించారు. అతని నుంచి సుమారు రూ.29 లక్షల హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. అతనిపై గతంలోనే కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు ఉంది.
హైబ్రిడ్ గంజాయిని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



