నేడు భారత్-శ్రీలంక మహిళల మధ్య ఆసియాకప్ ఫైనల్
దుబాయ్: మహిళల ఆసియా కప్ టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగే టైటిల్ కోసం భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకు ఏడుసార్లు ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు ఎనిమిదోసారి టైటిల్‌పై కన్నేసింది. తొలి సెమీఫైనల్లో భారత మహిళలు బంగ్లాదేశ్‌పై 40పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా.. ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీస్‌లో శ్రీలంక మహిళలు 4వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించి టైటిల్ పోరుకు చేరారు. ఈ రెండుజట్లు గ్రూప్ దశలోనూ ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమిచవిచూడకుండా ఫైనల్‌కు చేరడం మరో విశేషం. భారత ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన అద్భుత ఫామ్‌లో ఉండడం శుభ పరిణామం. టోర్నీలో షెఫాలీ రెండు అర్ధసెంచరీలతో రాణించగా.. మంధాన ఒక సెంచరీ సాధించింది. అయితే వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించడం లేదు. ఇక బౌలింగ్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (11 వికెట్లు) లంక కెప్టెన్ చమేరీ ఆటపట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతండగా.. తెలుగుతేజం శ్రీచరణి 8 వికెట్లతో రెండోస్థానంలో కొనసాగుతుంది. ఫైనల్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్, ప్రేమ రావత్ బ్యాటింగ్‌లో రాణిస్తే జట్టుకు తిరుగుండదు.
మరోవైపు లంక బ్యాటింగ్‌లో హర్షితా సమరవిక్రమ, నిలక్షిక సిల్వతో పాటు కవిషా దిల్హరీ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నారు. కానున్నారు. పాక్‌తో జరిగిన సెమీస్‌లో 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన లంకను హర్షితా, కవిషా, నిలక్షికలు బ్యాటింగ్‌తో జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. 2024 సీజన్ మహిళల ఆసియా కప్‌ను శ్రీలంక కైవసం చేసుకున్న రికార్డు ఉంది. ఆ ఏడాది జరిగిన ఫైనల్లో భారత జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన శ్రీలంక టైటిల్‌ను అందుకుంది. భారత్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ చమేరీ ఆటపట్టు (61), హర్షిత సమరవిక్రమ (69 నాటౌట్) 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించారు. ఈసారి ఫైనల్ కూడా శ్రీలంకతో జరగనున్న నేపథ్యంలో హర్మన్‌సేన 2024 నాటి ఫైనల్‌కు బదులు తీర్చుకోవడంతో పాటు ఎనిమిదోసారి ఆసియాకప్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ముఖాముఖి పోరులో ఇరుజట్లు ఇప్పటివరకు 29 సార్లు తలపడితే.. ఇందులో 23 సార్లు భారత్ గెలిస్తే, ఐదుసార్లు లంక విజయాన్ని అందుకుంది. మరో మ్యాచ్ ఫలితం రాలేదు.
జట్లు(అంచనా)…
భారత మహిళలు: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రీచా ఘోష్(వికెట్ కీపర్), మంధాన, షెఫాలీ వర్మ, ప్రతికా రావల్, దీప్తి శర్మ, భారతి ఫుల్మాలీ, శ్రీచరణి, క్రాంతి గాడ్, నందిని శర్మ, ప్రేమా రావత్/అరుంధతి.
శ్రీలంక మహిళలు: ఆటపట్టు(కెప్టెన్), కౌశానీ(వికెట్ కీపర్), దులానీ, కవింది, హాసిని, సమరవిక్రమ, దిలారి, నీలాక్షి, సుగంధిక, చాముండి, మిధాలీ/కావ్యా.
టైటిల్ కొట్టేదెవరో…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



