నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం బిజ్జల్వాడి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని ప్రారంభించారు. ఆయనతో పాటు గ్రామ సర్పంచ్ వాగ్మారే గంగాబాయి ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే గృహ నిర్మాణ లబ్ధిదారులకి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం ప్రతి కుటుంబానికి స్థిర నివాసం కల్పిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. ప్రతీ పేదవాడికి ఇళ్లు ఇచ్చి వారి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని జుక్కల్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -



