Thursday, April 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకదలని చక్రాలు

కదలని చక్రాలు

- Advertisement -

డిపోలకే పరిమితమైన బస్సులు
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె
తొలిరోజు విజయవంతం
రాజకీయపార్టీలు, కార్మిక సంఘాల మద్దతు
కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం
సర్కార్‌ కుయుక్తులు..తప్పుకున్న సూపర్‌వైజర్ల సంఘం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె తొలిరోజు విజయవంతమైంది. సర్కారుతో చర్చలు విఫలమైన నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి నుంచే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 97 బస్‌ డిపోల్లో వేలాదిగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. సమ్మెకు ప్రభుత్వ మే కారణమనీ, అనివార్యమైందని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు సర్కారు కుయుక్తులు పన్నుతున్నట్టు తెలిపింది. సూపర్‌వైజర్ల సంఘాన్ని సమ్మె నుంచి విరమింపజేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నీ డిపోల ఎదుట ఆయా సంఘాల నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతరులు సమ్మెలోకి వెళ్లిన నేపథ్యంలో రోడ్లన్నీ కళతప్పాయి. ఒకవైపు ఇదంతా జరుగుతుండగానే మరోవైపు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించారు. ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కా రానికి సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనీ, కార్పొరేషన్‌లో కార్మిక సంఘాలను అనుమతించాలనీ, ట్రేడ్‌ యూనియన్ల కార్యకలాపాలపై ఆంక్షలు ఎత్తివేయాలనీ, విద్యుత్‌ బస్సుల కొనుగోలు, నిర్వహణ ఆర్టీసీ సంస్థే నిర్వ హించాలనీ, ఆర్టీసీని పరిరక్షించాలనీ, పెండింగ్‌లో ఉన్న రెండు పీఆర్సీలను అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 17 డిపోల్లోని కార్మికులు దాదాపు 35వేల మందికిపైగా సమ్మెలో పాల్గొ న్నారు. సమ్మె నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ బస్టాండ్‌, సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్లతోపాటు హైదరాబాద్‌, రంగారెడ్డి రీజియ న్లల్లో ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలు బోసి పోయాయి. ఆర్టీసీ జేఏసీ నేతలంతా ఆయా డిపోల్లో సమ్మెలో పాల్గొన్నారు. బుధవారం నగరం లోని గన్‌పార్క్‌ సందర్శించి అమర వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. మరోపక్క ప్రభుత్వం అనుభవం లేని డ్రైవర్లతో బస్సులను నడిపే ప్రయత్నం చేసింది. అలాగే డిపోల వద్ద పోలీసు పహారా మధ్య ఆర్టీసీ బస్సులను జిల్లాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. కరీంనగర్‌లో ఈ తరహా ప్రయత్నం వికటించింది. బస్సు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.

ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో సర్వీసుల పెంపు
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో సర్వీసులను పెంచింది. అదనపు ట్రిప్పులు వేయాలని నిర్ణయించింది. బుధవారం నగరంలోని మెట్రో సర్వీ సులన్నీ కిక్కిరిసిపోయాయి. మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ కారిడార్‌లో సాధారణంగా పీక్‌ అవర్స్‌లో మూడు నిమిషాల 40సెకన్లకు ఒక రైలు, నాన్‌పీక్‌లో నాలుగు నిమిషాల 50 సెకన్ల కు ఒక రైలు నడిచేది. ఇప్పుడు నాలుగు నిమిషాల 20 సెకన్లకు ఒక రైలు చొప్పున రోజంతా నడపనున్నారు. ఇకపోతే నాగోల్‌-రాయదుర్గ్‌ కారిడార్‌లో సాధారణంగా నాన్‌ పీక్‌లో ఐదు నిమిషాల 20 సెకన్లకు ఒక రైలు నడిచేది. ఇప్పుడది మూడు 40 నిమిషాలకు ఒక రైలును నడపాలని మెట్రో అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాత్రి 11 గంటల తర్వాత కూడా సర్వీసులు పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు మెట్రో ఎండీ ప్రకటించారు.

సమస్యలు పరిష్కరించి సమ్మె నివారించాలి : సీఐటీయూ
ఈ సమ్మెకు సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సీఐటీయూ) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఆర్టీసీలోని కార్మిక సంఘాల జేఏసీతో మరో దఫా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చేపట్టి సమస్యలు పరిష్కరించాలనీ, సమ్మెను నివారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. లేనిపక్షంలో యావత్‌ కార్మికవర్గాన్ని సమీకరించి సమ్మెకు మద్దతుగా ప్రత్యక్ష పోరాటంలోకి దిగుతామని ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించింది. కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన సమ్మె పిలుపు నేపథ్యం లో ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి, సాచివేత ధోరణి సరైంది కాదు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సమ్మె విరమిస్తేనే చర్చలకు సిద్ధమనడం విడ్డూరంగా ఉంది. ఇది నియంతత్వ ధోరణే. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా పాలన అంటూనే గత ప్రభుత్వం మాదిరిగా కార్మిక ఉద్యమాలను అణచివేసే వైఖరి ప్రదర్శిస్తున్నది. సంవత్సరాల తరబడి సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న కార్మికులకు పోరాటం తప్ప మరో దారి లేదని పాలకులు గ్రహించాలి. ప్రభుత్వం వెంటనే ఆ సమస్యలు పరిష్కరించి, బాధ్యతగా వ్యవహరించాలి. ఆ పని చేయకుండా, కార్మికులను రెచ్చగొట్టడం సరైంది కాదు. సీఐటీయూ శ్రేణులు, అనుబంధ సంఘాలు క్షేత్రస్థాయిలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అండగా నిలవాలని పిలుపునిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ చెప్పారు.

సీఎం స్పందించాలి: జేఏసీ
గన్‌పార్క్‌ వద్ద జేఏసీ నేతలు ఈదురు వెంకన్న, థామస్‌రెడ్డి,రాజిరెడ్డి, వీఎస్‌ రావు, రవీందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ”సమ్మె దీర్ఘకాలంగా కొనసాగకుండా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలి. 31 డిమాండ్ల విషయంలో సానుకూలంగా చర్యలు తీసుకోవాలి. సమ్మె చట్టవిరుద్ధం కాదు. చట్టబద్ధం. రాజ్యాంగం కల్పించింది. సీఎం, మంత్రులు, ఆర్టీసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. బెదిరింపులు సరికాదు. అనివార్యమైన పరిస్థితుల్లోనే సమ్మెకు వెళ్లాల్సి వచ్చింది” అని అన్నారు.

సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు.సమస్యకు సమ్మె పరి ష్కారం కాదన్నారు కార్మికుల సమస్య పరిష్కా రానికి కమిటీ వేసినట్టు తెలిపారు. నాలుగు వారా ల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించి నట్టు చెప్పారు. 32 అంశా ల్లో 29 సమస్యలు వెంటనే పరిష్కారం చేయదగి నవనీ, ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ విషయాలపై సీఎం, డిప్యూటీ సీఎం దగ్గర చర్చిస్తామని వివరించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులను హరీశ్‌రావు రెచ్చగొట్టారని విమర్శించారు. మహాలక్ష్మి పథకాన్ని అప్రతిష్ట పాల్జేస్తు న్నారని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికులకు 2013 బాండ్లు రూ.280 కోట్ల వరకు, 1134 మందికి కారుణ్య నియామ కాలు చేసినట్టు వివరించారు. ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు అవసరమైనప్పుడు రూ. 400 కోట్లు ఇస్తున్నద న్నారు. అవసరమైతే ఎంతైనా ఇవ్వడానికి సిద్ధమేనని గుర్తుచేశారు. సమ్మెకు నాయకత్వం వహించేవారు, ఉద్యోగాలు చేయనివారు, రిటైరైన వారు ఉన్నారని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే కార్మికులను రెచ్చగొట్టారని వ్యాఖ్యానిం చారు. డిప్యూటీ సీఎం చెన్నైలో ఉండటంతో మాట్లాడలేక పోయామని చెప్పారు. అధికారుల సంప్రదింపులు కొనసాగు తుండగానే కార్మిక నేతలు సమ్మెలోకి వెళ్తతామని చెప్పుకుంటూ చర్చల నుంచి వెళ్లిపోయారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం యూనియన్లను రద్దుచేసినప్పుడు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

సమ్మె వద్దు..మాయమాటలు నమ్మొద్దు: ఎండీ నాగిరెడ్డి
పారిశ్రామిక వివాదాలచట్టం, 1947ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధం. సంఘాలు, వ్యక్తుల మాయమాటలు నమ్మొద్దు. ఒకవైపు చర్చలు జరుగుతుండగా, మరోవైపు సమ్మెలోకి వెళ్లడం సరికాదు. కార్మిక శాఖతోపాటు నలుగురు ఉన్నతాధికారుల కమిటీ కార్మికుల సమస్యలపై పనిచే స్తున్నాయి. కార్మికుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. సమ్మెను విరమించుకుని యథావిధిగా కార్మికలు తమ విధులకు హాజరుకావాలని యాజమాన్యం కోరుతున్నది. సంస్థను కాపాడుకో వాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. కార్మికులు, యూనియన్‌ నాయకులు పత్రికలు లేదా సోషల్‌ మీడియాలో ఇచ్చే అనధికారిక పిలుపులకు స్పందించొద్దు.

బెదిరింపులకు ఖండన: కూనంనేని సాంబశివరావు
చట్టవిరుద్దమైన సమ్మెలో కార్మికులు పాల్గొనడం మూలంగా వేతన కోతతోపాటు ఉద్యోగ నిబంధనల ప్రకారం కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం బెదిరించడాన్ని ఖండిస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు సీపీఐ అండగా ఉంటుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడా నికి ఆర్టీసీ కార్మికులే కారణం. మరిచిపోవద్దు. పీఆర్సీ చట్టబద్దంగా అమలుచేయాలి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -