Thursday, April 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇక భవిష్యత్‌ ఇంధనం గ్రీన్‌ హైడ్రోజన్‌

ఇక భవిష్యత్‌ ఇంధనం గ్రీన్‌ హైడ్రోజన్‌

- Advertisement -

– ఈ రంగంలో చైనా, భారత్‌లు ముందంజ
– మందకొడిగా పశ్చిమ దేశాలు
న్యూఢిల్లీ, బీజింగ్‌ :
ఇక భవిష్యత్‌ ఇంధనంగా రూపొందనున్న హరిత హైడ్రోజన్‌ రంగంపై పట్టు సాధించేందుకు చైనా, భారత్‌లు చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. పెద్ద ఎత్తున గ్రీన్‌ హైడ్రోజన్‌ (పునర్వినియోగ ఇంధనాన్ని ఉపయోగించడం ద్వారా నీటి ఎలక్ట్రాలసిస్‌ ద్వారా ఉత్పత్తయ్యే హైడ్రోజన్‌) ఉత్పత్తి సామర్ధ్యాన్ని నిర్మించుకునేందుకు ఇరు దేశాలు పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్నాయి. పారిశ్రామిక ఆధిపత్యాన్ని నిలుపుకోవడంపై చైనా దృష్టి కేంద్రీకరించగా, భారత్‌ ఇంధన భద్రతకు పెద్ద పీట వేస్తోంది. సబ్సిడీలు ఇవ్వడం, దేశీయ డిమాండ్‌ను పెంచుకోవడం ద్వారా దేశంలో ఇంధన భద్రతను ప్రాధాన్యతనివ్వాలని భావిస్తోంది. పశ్చిమ దేశాల్లో ఈ రంగంలో కొంత స్తబ్ధత నెలకొన్న నేపథ్యంలో చైనా, భారత్‌లు ఈ రంగంలో తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి చూస్తున్నాయి. ఇందుకు అవసరమైన రాజకీయ సంకల్పం, ఆర్థిక తోడ్పాటు సమకూర్చుకుంటున్నాయి. వాతావరణ కాలుష్యానికి ఇతోధికంగా దోహదపడుతున్న బొగ్గుకు దూరంగా వెళ్లాలని చైనా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం 200కోట్ల డాలర్ల ప్రాజెక్టులో భాగమైంది. భారత్‌ కూడా ఈ విషయంలో చైనా ఆశయాలను పంచుకుంటోంది. అయితే ఇక్కడ భారత్‌ నిబద్ధత మరింత నిర్దిష్టంగా, ఒకింత దూకుడుగా వున్నాయి. దాదాపుగా 210కోట్ల డాలర్ల విలువ చేసే సబ్సిడీల తోడ్పాటుతో 2030కల్లా ఏటా 50లక్షల మెట్రిక్‌ టన్నుల హరిత హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రస్తుత గ్లోబల్‌ మార్కెట్‌కు ఐదు రెట్లు ఎక్కువగా వుంది. అప్పటికి చైనా ఉత్పత్తికి దాదాపుగా రెట్టింపని అంచనా వేస్తున్నారు. ఊహించిన దానికన్నా మరింత అధికంగా వ్యయ పరిమితులు నెలకొంటూ వుండడంతో ఈ దశాబ్దం ప్రారంభంలో పెట్టుకున్న గ్రీన్‌ హైడ్రోజన్‌ లక్ష్యాలకు దూరంగా పశ్చిమ దేశాలు వెనక్కి మళ్ళుతున్నాయి. అదే సమయంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా, భారత్‌లు పెద్ద ఎత్తున ఉత్పత్తికి నడుం బిగించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -