Thursday, April 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతు సంఘం కార్యాలయంలో జెండావిష్కరణ

రైతు సంఘం కార్యాలయంలో జెండావిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3వ మహాసభల నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో గల రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ. ఏప్రిల్‌ 23, 24, 25 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరగనున్న మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గడిచిన మూడేండ్లలో జరిగిన పోరాటాలను సమీక్షించుకోవడానికీ, భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకోవడానికి ఈ మహాసభలు వేదిక కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కా రాములు, పాలడుగు భాస్కర్‌, కోశాధికారి వంగూరు రాములు, వృత్తి సంఘాల నాయకులు లెల్లెల బాలకృష్ణ, ఉడుత రవీందర్‌, పైళ్ల ఆశయ్య, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, అనగంటి వెంకటేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు, ఉపాధ్యక్షులు దామెర కిరణ్‌, సహాయ కార్యదర్శి అశోక్‌ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌ ఆంజనేయులు, కేవీపీఎస్‌ నాయకులు విజరు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -