స్వర్గీయ పావలా శ్యామల కూతురు మాధవిని రమణాచారి ఫౌండేషన్‌లో జాయిన్ చేస్తున్నామని ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ట్రెజరర్ శివ బాలాజీ తెలిపారు. ఆమె సంక్షేమం కోసం సీనియర్ నటుడు నరేష్, మురళీ మోహన్ తదితరులు యాభై వేల రూపాయలు చొప్పున ఆర్థిక విరాళాన్ని అందించారు. ఆమె సంక్షేమాన్ని ‘మా’ చూసుకుంటుందని ఆయన తెలిపారు. ట్రెజరర్ శివ బాలాజీ మాట్లాడుతూ,‘పావలా శ్యామల కూతురు మాధవి ‘మా’ మెంబర్ కాదు. ‘మా’ ఫండ్ ని ఇవ్వలేం. అయితే మానిక్ రమణాచారి ఫౌండేషన్‌తో మాట్లాడారు. ఫుడ్డు, బెడ్డు, ఫిజియో థెరపీ ఆయనే చూసుకుంటామని చెప్పారు. కేర్ టేకర్‌ని మాత్రం మేం నియమించాం. ‘మా’ అసోసియేషన్ ఫండ్‌ని మాత్రం వృథా చేయడం లేదు. చాలా మంది సాయం చేస్తామని ఫోన్స్ చేస్తున్నారు. అలా ఇవ్వాలని అనుకునే వారు ‘మా’కి విరాళం ఇవ్వండి. మేం ఆ ఫండ్‌ని మాధవి కోసం వాడతాం’ అని తెలిపారు. మాధవి మాట్లాడుతూ,‘మా అమ్మని చూసుకున్నట్లే నన్ను కూడా ‘మా’ అసోసియేషన్ చూసుకుంటోంది. మీడియా వాళ్ళు నేను చెప్పని విషయాన్ని వక్రీకరించి రాయొద్దని అభ్యర్ధిస్తున్నాను’ అని అన్నారు.
మాధవికి ‘మా’ అండ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



