Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతుల అభివృద్ధి కోసమే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 

రైతుల అభివృద్ధి కోసమే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 

- Advertisement -

ఆలేరు  రావిరాల గ్రామాల్లో కేంద్రాలు ప్రారంభం
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ కత్తుల కళ్యాణి యాకాంతం 
నవతెలంగాణ – నెల్లికుదురు 

రైతులు ఆర్థికంగా ఎదగడం కోసమే ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందని వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని ఆలేరు గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి, రావిరాల గ్రామ సర్పంచ్ కత్తుల కళ్యాణి యాకాంతం, తెలిపారు. గురువారం శ్రీరామగిరి పిఎసిఎస్ సీఈవో కత్తుల వెంకన్న త కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు పెద్దపీట వేసిందని అంతేకాకుండా రైతులు పండించిన వారి దాన్యం పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ని కూడా ఇస్తుందని, రైతు భరోసా నిధులు కూడా ఇస్తుందని అంతేకాకుండా రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు కేంద్రనికి తీసుకురావాలని ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరకే అమ్ముకోవాలని తెలిపారు. అలాకాకుండా దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అరె తరుణ్ వార్డ్ సభ్యులు వెంకటమల్లు, సాగర్, కుమార్, శ్రీకాంత్, సూర్య ప్రసాద్, పిఎసిఎస్ సెక్రటరీ కత్తుల వెంకన్న, స్టాప్ శ్రీరాం  రంజిత్, మాల్సుర్, ఇంచార్జ్ ఆరే సుధాకర్, వెంకన్న మరియు కాంగ్రెస్ నాయకులు జిలుకరా యాలాద్రి రైతులు రేఖ నరేష్, వడ్కాపురం నర్సయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -