నవతెలంగాణ -పెద్దవంగర
మండలంలోని అవుతాపురం ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బానోత్ భీమా నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు సర్కారు పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టుదల, క్రమశిక్షణతో చదువుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రతిభా కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిరంజీవి, ప్రతిభ, రజిత, అంగన్వాడీ టీచర్లు సంధ్య, మంజుల, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



