నవతెలంగాణ – హైదరాబాద్ : హర్మూజ్ జలసంధిలో ఓ భారీ ఆయిల్ ట్యాంకర్ నౌకా మైన్లను ఢీకొని పేలిపోయినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నేవీ మంగళవారం ప్రకటించింది. ‘ఎల్ గియా’ అనే ఈ సూపర్ ఆయిల్ ట్యాంకర్, తాము నిషేధించిన మార్గంలో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. ఐఆర్‌జీసీ అధికారిక మీడియా సంస్థ సెపా న్యూస్ కథనం ప్రకారం.. మైన్లను ఢీకొట్టిన వెంటనే ట్యాంకర్‌లో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. నౌక మొత్తం మంటల్లో చిక్కుకుందని, వాటిని అదుపు చేసే ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపింది. ఈ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలో ఉందని, చట్టవిరుద్ధమైన మార్గంలో ప్రయాణిస్తే ఎదురయ్యే ప్రమాదాల గురించి తాము ముందే హెచ్చరికలు జారీ చేశామని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది.
హర్మూజ్ జలసంధిలో భారీ పేలుడు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



