- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
జిల్లా కేంద్రంలోనవంబర్ 15 నుండి 18 వరకు జరిగే అఖిలభారత 36వ రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య తాహసిల్దార్, మండల ప్రజా పరిషత్, కామన్ హెల్త్ సెంటర్ లలో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. రైతులు, కార్మికులు, మేధావులు, విద్యావంతులు, అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మైల సత్తయ్య, సల్పోజు రామలింగ చారి, కొట్టం యాదయ్య, చెల్లం ముత్యాలు, దామెర లక్ష్మీ, ఏరుకొండ రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



