Tuesday, September 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆద్యంతం ఉత్కంఠభరితం

ఆద్యంతం ఉత్కంఠభరితం

- Advertisement -

ఫస్ట్ కాపి మూవీస్, కేడి అండ్‌ కో బ్యానర్ పై వాచస్పతి దర్శకత్వంలో పంచుమర్తి నరేష్ బాబు నిర్మించిన సినిమా ‘మిస్సింగ్‌ మేఘన’. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈనెల 18న థియేటర్స్ లో విడుదల కానున్న సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మాత దామోదర్ ప్రసాద్ హాజరయ్యారు. ‘తంత్ర’ చిత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ, ‘నరేష్ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకు నా స్నేహితుడు వాసు దర్శకత్వం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 18న విడుదల కానున్న కానున్న ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ‘ఈ సినిమా గురించి నేను విన్నప్పుడు సినిమాకు సంగీతం అందించడం కొంచెం కొత్తగా అనిపించింది. సినిమాకు మంచి పాటలు అందించాలని అనుకున్నాను. సినిమా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అలరాజు మంచి పాటలు అందించారు’ అని సంగీత దర్శకుడు ఆర్ ఆర్ ధ్రువన్ చెప్పారు.బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ,‘ఈ సినిమా చూసాక చాలా ఇంట్రెస్ట్ గా అనిపించి, సపోర్ట్ చేయాలనుకున్నాను’ అని తెలిపారు.
దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ, ‘ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం కథ. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన చిత్ర బృందం అందరికీ థాంక్స్. ఈ నెల 18న విడుదల కానున్న ఈ సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, ‘సినిమా అంటే డబ్బు కాదు, కొంత మంది జీవితం. ఎటువంటి కష్టం వచ్చినా సినిమా కోసం నిలబడాలి. చిన్న సినిమాలకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమాకు సంగీతం అందించిన ధ్రువన్ పాటలు వల్ల సినిమా ప్రేక్షకులకి బాగా వెళ్ళింది’ అని నటుడు రామ్ కార్తీక్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -