Tuesday, September 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసంక్రాంతికి 'ఫ్యామిలీ ప్యాక్' రిలీజ్‌

సంక్రాంతికి ‘ఫ్యామిలీ ప్యాక్’ రిలీజ్‌

- Advertisement -

హీరో శ్రీ విష్ణు తాజాగా మరో ఆసక్తికరమైన ఎంటర్‌టైనర్‌తో వస్తున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తుండగా, అనిల్ యెర్నేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘సామజవరగమన’ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన సాక్షి మధోల్కర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా మేకర్స్ ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్టర్‌, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే హ్యూమరస్ టైటిల్‌తోనే సినిమా ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతుందో ప్రజెంట్ చేశారు. ‘శ్రీ విష్ణుతో నరేష్ వీకే కాంబినేషన్ మరోసారి హిలేరియస్ మూమెం ట్స్‌ను ఈ సినిమా అందించనుంది. వీరిద్దరి కామిక్ కెమిస్ట్రీ ‘ఫ్యామిలీ ప్యాక్’కు ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలవనుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది’ అని మేకర్స్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -