Thursday, September 17, 2026
E-PAPER
Homeఖమ్మంక్విజ్ పోటీల్లో ప్రతిభ చాటిన టాలెంట్ స్కూల్ విద్యార్థులు

క్విజ్ పోటీల్లో ప్రతిభ చాటిన టాలెంట్ స్కూల్ విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి
బాలగంగాధర్ తిలక్ స్మారక గణేశ్ ఉత్సవ సమితి రేంజ్లో వారి  ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన క్విజ్ పోటీలలో సత్తుపల్లి ‘టాలెంట్ స్కూల్’ విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పోటీలలో పాఠశాలకు చెందిన ముప్పాల కావ్య, షేక్ ఆస్పియా, చిన్నంశెట్టి లాస్యశ్రీ, వంట్ల జస్మితశ్రీ, శీలం నాగ తేజస్విని రెడ్డి, నక్కా జోష్విత్ చరణ్ లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు రూ. 3వేలు నగదు బహుమతితో పాటు జాతీయ నాయకుల జీవిత చరిత్ర పుస్తకాలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా విజేతలను ఆలయ కమిటీ నిర్వాహకులు, పాఠశాల కరస్పాండెంట్ పులి శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ పులి అరుణ, ఇన్ఛార్జ్ శంకర్ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -