Thursday, September 17, 2026
E-PAPER
Homeఖమ్మంమున్సిపల్ కార్యాలయంలో 'ప్రజాపాలన' దినోత్సవం 

మున్సిపల్ కార్యాలయంలో ‘ప్రజాపాలన’ దినోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చైర్ పర్సన్ రెహానా కమల్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా పాలన అనేది విజయవంతంగా సాగుతోందన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు హామీ ఇవ్వని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పేద ప్రజల కళ్ళలో ఆనందం కనపడుతోందన్నారు.

ఉచిత బస్సు, ఉచిత కరెంటు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రైతు భరోసా ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తొందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, దొడ్డాకుల గోపాలరావు, బొంతు వేణు, చల్లగుండ్ల కృష్ణయ్య, నారాయణరెడ్డి, విరివాడ నాగభూషణం, కంటే అప్పారావు, ఖలీల్, తన్నీరు జమలయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -