తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ
సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గునీగంటి రాజన్న
నవతెలంగాణ-నెల్లికుదురు
తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన అమరవీరుల పాత్ర గొప్పదని వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గునిగంటి రాజన్న పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలో అమరవీరులను స్మరించుకుంటూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గునీగంటి రాజన్న మాట్లాడుతూ.. ప్రాంతంలో నాడు నిజాం రాజును గడగడలాడించిన అమరులైన యోధులు దొడ్డి కొమురయ్య చాకలి ఐలమ్మ లాంటి ఎంతో మంది ఈ ప్రాంతంలో ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం కావడంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమని తెలిపారు.
సాయుధ పోరాటంలో నెల్లికుదురు కీలక పాత్ర పోషించింది అన్నారు. రైతాంగ సాయిధ పోరాటంలో ఎందరో అమరులైనారని అన్నారు. బీజేపీకి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధం లేదని, బీజేపీ ఉద్యమాన్ని వక్రీకరిస్తుందని ఆరోపించారు. సాయిధ పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రైతులకు యూరియా యాప్ ద్వారా కాకుండా నేరుగా షాపులలో డైరెక్ట్ గా ఏ ఆంక్షలు లేకుండా యూరియాను రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైతులు పండించడానికి నీరు అవసరమని కాలుల ద్వారా నీళ్లు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. రైతు రాజ్యం అంటూ రైతులు ఇబ్బందుల పాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చెందారు.
కేంద్ర ప్రభుత్వం కార్మికులను పట్టించుకోవడంలో విఫలం చెందిందని అన్నారు. రైతు అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పుకుంటూ రైతులకు ఇచ్చేటువంటి మందు బస్తాల్లో అధికంగా రేట్లు పెంచి రైతు ఇవ్వడంతో ఆర్థికంగా రైతు ఎంతో నష్టపోయి పెట్టుబడికి పూర్తిస్థాయిలో ఆర్థికంగా లేక ఇబ్బంది పడుతున్నాడని అన్నారు. పెంచిన మందు బస్తాల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెరుమాండ్ల బాబు గౌడ్, పెరుమాండ్ల పుల్లయ్య ,నలమాస యాకాంతం, తోట నరసయ్య తోట యాకయ్య ,బాణాల యాకన్న, బోడ మాంగ్య, బత్తిని సత్యనారాయణ , బత్తిని వెంకన్న, బిక్షపతి నాయకులు పాల్గొన్నారు.



