- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలోని మిషిగన్‌లో శిక్షణలో ఉన్న ఎఫ్-16 యుద్ధ విమానం గురువారం కుప్పకూలింది. టెక్సాస్ ఎయిర్ నేషనల్ గార్డ్‌కు చెందిన 149వ ఫైటర్ వింగ్ విమానం ట్రావర్స్ సిటీ సమీపంలో సాధారణ శిక్షణ మిషన్‌లో ఉండగా ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి ముందే పైలట్ విమానం నుంచి సురక్షితంగా బయటకు దూకినట్లు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -



