- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో ఈ నెల 20 నుంచి 23 వరకు 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు పసుపు హెచ్చరికలు జారీ చేసింది. నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడతాయంది. బంగాళాఖాతంలో 19న అల్పపీడనం ఏర్పడి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
- Advertisement -



