నవతెలంగాణ-ఆలేరుటౌను
మున్సిపల్ వాణిజ్య స్థలాన్ని, కబ్జా దారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని, స్థానిక నాయకులు పంపరి లక్ష్మీనారాయణ మున్సిపల్ అధికారులను కోరారు. గత మూడు సంవత్సరాల క్రితం బిఆర్ఎస్ పార్టీ, అధికారంలో ఉన్నప్పుడు, మున్సిపల్ పాలకవర్గం ఆలేరు పట్టణంలోని మెయిన్ రోడ్ లో మున్సిపల్ మడిగలను కూల్చి వేశారని చెప్పారు. గత చైర్మన్ వస్పరి శంకరయ్య హయాంలో నిర్మించాల్సిన మడిగలను నిర్మించలేదన్నారు. ఈ కూల్చివేసిన స్థానంలో మడిగలను నిర్మించలేదని, ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఈ మడిగల నిర్మాణంపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
గత కొన్ని నెలలుగా ఇట్టి మున్సిపల్ వాణిజ్య ఖాళీ స్థలంలో కొందరు వ్యక్తులు కబ్జా చేసి, పక్కాగా షెడ్లు వేసుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్నారని,ఇట్టి వాణిజ్య స్థలం సుమారుగా 1000 గజాలు ఉంటుందని, దాదాపుగా రూ.10 కోట్ల విలువ స్థలాన్ని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఈ స్థలము ఆక్రమణలకు గురయ్య ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్ రావుకి, ఈ స్థలాన్ని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని వినతి పత్రం అందజేశామన్నారు.
వాణిజ్య స్థలంలో మడిగెలు నిర్మిస్తే మున్సిపాలిటీకి కిరాయిల ద్వారా ఆదాయం వస్తుందని, అభివృద్ధికి వచ్చే కిరాయిలు దోహదపడతాయని, మరి కొందరికి ఉపాధి అవకాశలు పెంపొందించబడతాయన్నారు. మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి, మున్సిపల్ వానిజ్య స్థలాన్ని కబ్జాదాల నుంచి స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.



