- Advertisement -
నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండలంలోని చేగుంట గ్రామానికి రేపు ఉదయం 10:30 గంటలకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వివేక్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. చేగుంట గ్రామం కమాన్ వద్ద కేఎల్‌ఐ మంగనూరు నుంచి కమలుద్దీన్‌పూర్ 9ఆర్ మైనర్ కాలువ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -



