- Advertisement -
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండల ఎమ్ ఎస్ పీ నూతన అధ్యక్షుడిగా గద్దల దేవయ్య మాదిగ (అలియాస్ గద్దల వెంకటేశ్వరరావు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆశయాలకు అనుగుణంగా, ఆయన నాయకత్వంలో ముందుకు సాగుతూ సత్తుపల్లి ప్రాంతంలో పార్టీని సంపూర్ణంగా బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎమ్ఎస్ పీని బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంలో తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మాజీ అధ్యక్షుడు తిరుగంటి అంజయ్య మాదిగ, ఎమ్ఆర్ పిఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ పాల్గొన్నారు.
- Advertisement -



