Friday, September 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ళకు ప్రణాళికలు

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ళకు ప్రణాళికలు

- Advertisement -

తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఖరీఫ్ ధాన్యం కొనుళ్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య తెలిపారు. శుక్రవారం తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి బాపురావు అధ్యక్షతన, మండల ఎంపిడిఓ క్రాoతి కుమార్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితీగా పిఏసిఎస్ చైర్మన్ హాజరై మాట్లాడారు.

సొసైటీ ఆధ్వర్యంలో రైతులు పండించే ధాన్యాన్ని రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా లక్ష్యానికి మించి కొనుగోలు చేస్తున్నట్లుగా తెలిపారు. ధాన్యం సేకరణయే కాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు మరిన్ని సేవలంధిస్తున్నట్లుగా చెప్పారు. విత్తనాలు, ఎరువులు అందిస్తూ, పండించిన వరి దాన్యాన్ని లక్ష్యానికి మించి కొనుగోలు చేస్తూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లుగా చెప్పారు. రైతుల, సభ్యుల, అధికారుల సహకారంతో  జిల్లాలో తాడిచెర్ల సొసైటీని ప్రథమ స్థానంలో తీసుకపోవడమే తన ద్యేయంమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులకు, ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -