Saturday, September 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆద్యంతం అలరించే కాన్సెప్ట్‌

ఆద్యంతం అలరించే కాన్సెప్ట్‌

- Advertisement -

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’.ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఈనెల 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా శుక్రవారం ఈ సినిమాలోని మరో పాటను రిలీజ్ చేశారు. కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ, ‘టైటిల్‌, టీజర్‌లో శ్రీకాంత్ వాయిస్ ఓవర్ బాగుంది. తణికెళ్ల భరణి రిలీజ్ చేసిన పాట కూడా బాగుంది. ఈ సినిమాతో శ్రీనివాస్ కి మంచి విజయం దక్కాలి. ఆర్టిస్టులు తెరపై అద్భుతంగా కనిపించారు’ అని అన్నారు.‘ఈ సినిమాతో నిర్మాతగా అడుగు పెడుతున్నాను. ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాను. జెన్ జీ ఆడియెన్స్‌కి కూడా మూవీని చూపించాం. అన్ని వర్గాల ఆడియెన్స్‌కి సినిమా చాలా నచ్చింది. రాంబాబు మంచి సాహిత్యాన్ని ఇచ్చారు’ అని నిర్మాత చందు శ్రీనివాస్ తెలిపారు. ‘నేను గతంలో చేసిన ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’ రేంజ్‌లో ‘ప్రేమనే ఊరిలో’ ఉంటుంది. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. కన్నడ, తెలుగులో ఈ సినిమాకి మంచి విజయం దక్కుతుంది. ఈనెల 25న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. రూపాయి పెడితే ఐదు రూపాయల లాభం తీసుకు వచ్చే సినిమా అవుతుంది. నా ప్రాజెక్ట్‌లోకి సాకేత్ వచ్చాడంటే నాకు ధైర్యంగా ఉంటుంది’ అని సురేష్ కొండేటి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -