జపాన్‌పై 8 వికెట్లతో గెలుపు
నిస్సిన్ (జపాన్) : ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మెరుగైన ర్యాంక్‌తో నేరుగా క్వార్టర్ఫైనల్లో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఆతిథ్య జపాన్ను చిత్తు చేసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో 58 పరుగుల లక్ష్యాన్ని మరో 90 బంతులు ఉండగానే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఛేదనలో ఓపెనర్ షెఫాలీ వర్మ (40 నాటౌట్, 15 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచికొట్టింది. కమిలిని (0), భార్తి (6) నిరాశపరిచారు. రిచా ఘోష్ (12 నాటౌట్, 6 బంతుల్లో 2 ఫోర్లు) ఆకట్టుకుంది. 5 ఓవర్లలో 2 వికెట్లకు 59 పరుగుల చేసిన భారత్ ఆడుతూ పాడుతూ సెమీస్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ 19.5 ఓవర్లలో 57 పరుగులకు కుప్పకూలింది. తెలుగు తేజం శ్రీ చరిణి (4/10), షెఫాలీ వర్మ (2/13) మాయ చేశారు. జపాన్ తరఫున ఓపెనర్లు అయాక (25), హరుణ (10) మాత్రమే రెండెంకల స్కోర్లు సాధించారు.
సెమీస్‌లో భారత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



