Sunday, June 29, 2025
E-PAPER
Homeసినిమాకుటుంబ విలువలకు ప్రతిబింబం

కుటుంబ విలువలకు ప్రతిబింబం

- Advertisement -

టీఎస్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ సమర్పణలో ప్రొడక్షన్‌ నెం.3గా రూపొందిన కొత్త చిత్రం షూటింగ్‌ విజయవంతంగా ముగి సింది. తిరుపతి శ్రీనివాసరావు నిర్మాణ సారథ్యంలో, ఆదినారా యణ పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకోనుంది. హరికష్ణ హీరోగా, భవ్యశ్రీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రేమ, త్యాగం, కుటుంబ విలువలను ఆవిష్కరిస్తూ భావోద్వే గాలతో నిండిన కథాంశంతో రూపొందింది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ, స‌మా బృందం అంకితభావంతో పనిచేసింది. ఈ సినిమా అందరి హృదయా లను తాకుతుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు. ‘ప్రేక్షకులకు ఒక అర్థవంతమైన కథను అందించడమే మా లక్ష్యం’ అని తెలిపారు. త్వరలో ఆసక్తికరమైన టైటిల్‌తో విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -