Saturday, September 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ భారతిని సందర్శించిన ఎంజీయూ విద్యార్థులు

గ్రామ భారతిని సందర్శించిన ఎంజీయూ విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్,ఎమ్మెస్ డబ్ల్యూ (మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్)  డాక్టర్ నవీన్ రావు సమక్షంలో ఎంజీయూ విద్యార్థులు శనివారం మండల కేంద్రంలో ఉన్న గ్రామ భారతి ని సందర్శించారు.గ్రామ భారతిలోని ప్రకృతి వ్యవసాయం,విద్యార్థుల యొక్క స్థితిగతులపై పర్యవేక్షణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నవీన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలలో నాలుగు గోడల మధ్య విద్యనభ్యసించడం ద్వారా కేవలం వారికి విద్య మాత్రమే వస్తుందని అన్నారు.

అదే వివిధ గ్రామాలలో పర్యవేక్షించి గ్రామ అభివృద్ధి,గ్రామాల స్థితిగతులు,ప్రజల జీవన విధానం,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం ద్వారా విద్యార్థులకు సమస్యల పట్ల అవగాహన కలిగి,భవిష్యత్తులో సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలనే ఆలోచన వస్తుందని అన్నారు.అందులో భాగంగానే సోషల్ వర్క్ విద్యార్థులను గ్రామ భారతికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న విద్యార్థుల స్థితిగతులు,ప్రకృతి వ్యవసాయం,వ్యక్తిత్వ వికాసం,చేతి వృత్తుల పట్ల వారికి ఇచ్చే శిక్షణ పై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలుస కరుణాకర్,మోహనయ్య,లింగం,పాల్వాయి జగత్ రెడ్డి,గోలి కిరణ్,గ్రామ భారతి సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -