- Advertisement -
నవతెలంగాణ-అచ్చంపేట
వికలాంగులకు ప్రభుత్వం ప్రతినెల రూ. 4016 /- పింఛను ఇస్తుంది. ఈ పింఛను పొందుతున్న వికలాంగులు ఎవరైనా చనిపోతే అధికారులు వెంటనే అతని భార్యకు పింఛన్ సౌకర్యం కల్పించాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం నవ తెలంగాణతో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న వికలాంగుల పోస్టుల భర్తకి నోటిఫికేషన్ జారీ చేసి అర్హత గల వారితో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలన్నారు. అదేవిధంగా అర్హతగల వికలాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు.
- Advertisement -



