Wednesday, September 23, 2026
E-PAPER
Homeజాతీయంఅక్టోబర్‌ 20 నుంచి భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌‌టీఏ

అక్టోబర్‌ 20 నుంచి భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌‌టీఏ

- Advertisement -

మంత్రి పీయూశ్ గోయల్‌ వెల్లడి
‌న్యూఢిల్లీ :
భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) వచ్చే అక్టోబర్ 20వ తేది నుంచి అధికారికంగా అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ సోమవారం ప్రకటించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఒప్పందం అమల్లోకి రానుండటం విశేషమన్నారు. ఇరు దేశాల మధ్య వస్తు, సేవల వాణిజ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు పెట్టుబడులను మరింత విస్తృతపరచడమే లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని రూపొందించారన్నారు. గతంలోనే అంటే ఏప్రిల్ 27న ఇరు దేశాలు ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ తాజా ఒప్పందం ద్వారా భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులన్నింటికీ ఎలాంటి సుంకాలు లేకుండా న్యూజిలాండ్ మార్కెట్లోకి ప్రవేశం లభించనుంది. ఇప్పటివరకు సిరామిక్స్, కార్పెట్లు, ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలు వంటి కీలక భారతీయ వస్తువులపై న్యూజిలాండ్ ప్రభుత్వం 10 శాతం వరకు గరిష్ట సుంకాలు విధిస్తూ వస్తోంది. తాజా ఒప్పందంతో ఈ అడ్డంకులు తొలగిపోనున్నాయి. అంతేకాకుండా రాబోయే 15 ఏళ్లలో భారత్‌లో ఏకంగా 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు న్యూజిలాండ్ అంగీకరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -