- Advertisement -
నవతెలంగాణ-ఆసిఫాబాద్
జిల్లా కేంద్రంలోని వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంగళవారం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ పండరినాథ్ ఆలయం వద్ద ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకాష్, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సలాం, బిజెపి నాయకుడు విశాల్ లు హాజరై వడ్డించారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొనగా, జనకాపూర్ రామాలయంలో, సందీప్ నగర్ లోని వినాయకుని వద్ద, దస్నాపూర్ లోని వినాయకుని వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
- Advertisement -



