Tuesday, September 22, 2026
E-PAPER
Homeఖమ్మంస్వచ్ఛతా హి సేవా క్విజ్‌ ధ్రువీకరణ పత్రాల పంపిణీ

స్వచ్ఛతా హి సేవా క్విజ్‌ ధ్రువీకరణ పత్రాల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
స్వచ్ఛత, ఘన వ్యర్థాల నిర్వహణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన క్విజ్‌లో పాల్గొన్న విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలను మంగళవారం అందజేశారు.  అశ్వారావుపేట ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం ఎకోక్లబ్‌ మిషన్‌ లైఫ్‌ పోర్టల్‌ ద్వారా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై క్విజ్‌ నిర్వహించింది.

ఈ క్విజ్‌లో పాల్గొని ఆన్‌లైన్‌ ద్వారా పొందిన ధ్రువీకరణ పత్రాలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు స్వచ్ఛత, పరిసరాల పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడమే క్విజ్‌ నిర్వహణ ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -