Tuesday, September 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పర్యాటక దినోత్సవ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

పర్యాటక దినోత్సవ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయిలో తక్కువగా తెలిసిన పర్యాటక ప్రాంతాలు మరుగున పడుతున్న కళలు లేదా చేతివృత్తులపై నివేదిక అనే అంశంపై తాడిచెర్ల హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. ప్రథమ స్థానం బోయిని సిరి చందన,మహమ్మద్ సైలాని ద్వితీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను గ్రామ సర్పంచ్ బండి స్వామిపాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్.తిరుపతి, ఉపాధ్యాయ బృందం హృదయపూర్వకంగా అభినందించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులను  పోటీలకు సిద్ధం చేసిన గైడ్ టీచర్లు సి.హెచ్ స్వర్ణలత, రమేష్ లను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలలో కూడా ప్రతిభ కనబరిచి పాఠశాలకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -