Wednesday, September 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేటి నుంచి జిన్‌పింగ్‌ అమెరికా పర్యటన

నేటి నుంచి జిన్‌పింగ్‌ అమెరికా పర్యటన

- Advertisement -

చర్చల అజెండాపై పలు సన్నాహక సమావేశాలు
బీజింగ్‌ : కిర్గిజ్‌స్థాన్‌, ఈజిప్ట్‌, భారత్‌లో సుడిగాలి పర్యటనలు జరిపిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నేటి నుంచి మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు. జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనకు ముందు అనేక సన్నాహక సమావేశాలు జరిగాయి. ట్రంప్‌, జిన్‌పింగ్‌ మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశపు అజెండాను ఖరారు చేయడానికి అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌, చైనా ఉపాధ్యక్షుడు హే లెఫెంగ్‌తో న్యూయార్క్‌లో ఆదివారం సమావేశమయ్యారు. అంతకుముందే పర్యటనపై చర్చించడానికి అమెరికా, చైనా విదేశాంగ మంత్రులు మార్కో రుబియో, వాంగ్‌ యీ మధ్య ఫోన్‌ సంభాషణ జరిగింది. శిఖరాగ్ర సమావేశం యొక్క వివరాలను ఖరారు చేయడానికి జూలైలో చైనా సహాయ మంత్రి మా జావోక్సూ వాషింగ్టన్‌ వెళ్లారు. గత సంవత్సరం మేలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బీజింగ్‌ను సందర్శించారు. గత సంవత్సరం అక్టోబరులో దక్షిణ కొరియాలోని బుసాన్‌లో ఇరువురు నేతల మధ్య కీలక చర్చలు జరిగాయి. కాగా జిన్‌పింగ్‌, ట్రంప్‌ మధ్య అనేక కీలక అంశాలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -