Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టాటా ఏఐఏ రూ.4.10 కోట్ల క్లెయిమ్ అందజేత

టాటా ఏఐఏ రూ.4.10 కోట్ల క్లెయిమ్ అందజేత

- Advertisement -

– కేవలం 15 రోజుల్లోనే సెటిల్

నవతెలంగాణ హైదరాబాద్:

అత్యవసర సమయాల్లో కుటుంబానికి ఆర్థిక రక్షణ, భరోసా అందించడంలో లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ మరోసారి నిరూపించింది. హిమాయత్ నగర్ బ్రాంచ్‌కు చెందిన సీనియర్ లైఫ్ ప్లానర్ (అడ్వైసర్) కె. ఆనంద్ రెడ్డి (56) ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన 48 ఏండ్ల వయసులో టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. ఆయన నామినీ అయిన బార్య శోభారాణి ఆగస్టు 25న క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బాధిత కుటుంబానికి వేగంగా ఆర్థిక సహాయం అందించేందుకు టాటా ఏఐఏ సంస్థ రికార్డు స్థాయిలో కేవలం 15 రోజుల్లోనే క్లెయిమ్ ప్రక్రియ అంతటినీ పూర్తి చేసింది. సెప్టెంబర్ మొదటి వారంలో రూ.4.10 కోట్ల భారీ క్లెయిమ్ మొత్తాన్ని విజయవంతంగా సెటిల్ చేసింది. ఈ సందర్భంగా క్లైమ్ చెక్కు మంగళవారం వారి కుటుంబ సభ్యులకు టాటా ఏఐఏ క్లస్టర్ హెడ్ సూర రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇంటికి వెళ్లి అందించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇన్సూరెన్స్ అనేది కేవలం పాలసీ మాత్రమే కాదని, ఆపదలో కుటుంబాలకు రక్షణగా నిలిచే గొప్ప భరోసా అన్నారు. ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ తో ధీమా కల్పించాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ హెడ్ దయానంద్, బీఏఎంలు కైలాష్, సురేష్, పార్ట్‌నర్ అర్షద్‌, సీనియర్ బిజినెస్ అసోసియేట్ లీడర్ పుష్ప-అనిల్ కుమార్, లీడర్లు పొడగుర్తి చెంచు రామయ్య(రాము), బధవత్ నవీన్ నాయక్, ఇతర లీడర్లు, అడ్వైజర్లు పాల్గొన్నారు.

ఉచిత కన్సల్టేషన్.. ఉపాధి అవకాశాలు

ఈ సందర్భంగా సీనియర్ బిజినెస్ అసోసియేట్ లీడర్ మల్లారపు పుష్ప మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో కుటుంబాన్ని ఆదుకునేలా హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలని, సరైన పాలసీల ఎంపిక కోసం 9491679493 నెంబర్ ద్వారా ఉచితంగా సంప్రదించవచ్చని తెలిపారు. బీమాపై సరైన అవగాహన కల్పించడంతో పాటు, ఉన్న ఊరిలోనే ఉపాధి పొందేందుకు దేశ వ్యాప్తంగా నియమాలు చేపట్టి కొత్త ఇన్సూరెన్స్ అడ్వైజర్లకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. బిజినెస్ అసోసియేట్ ఏజెన్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియ కూడా జరుగుతోందని, ఆసక్తి గలవారు ఆన్‌లైన్ లింక్ (https://mallarapupushpa.tataaiapartner.com?tid=gvuiu ) ద్వారా సంప్రదించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -