నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని వెల్మలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న ఏకరుప దుస్తులు,షూ,టై,బెల్టులు మండల విద్యాశాఖ అధికారి. లక్ష్మణ్ బాబు,గ్రామ సర్పంచ్ బండి స్వామి బుధవారం అందజేశారు.ఈ సందర్భంగా ఎంఈఓ,సర్పంచ్ మాట్లాడారు ప్రయివేటు కార్పోరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు మధ్యాహ్న భోజనం,నోట్ బుక్కులు,పాఠ్య పుస్తకాలు,ఏకరూప దుస్తులను అందిస్తోందన్నారు.
తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలన్నారు.మూతపడిన పాఠశాలను 26మంది విద్యార్థులతో పునః ప్రారంభం చేయడం అభినందనీయమన్నారు.పాఠశాల అభివృద్ధికి గ్రామ పంచాయతీ తరుపున సాయ,సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం మధ్యాహ్న భోజనం పరీక్షించడానికి విద్యార్థులతో పాటు అందరూ అక్కడే భోజనం చేశారు.ఈ కార్యక్రమం లో కాంప్లెక్స్ హెచ్ఎం తిరుపతి రెడ్డి,సిఆర్పిలు సమ్మయ్య,సమతా పాఠశాల హేఎం సురేష్,ఉపాధ్యాయులు బెజగం సతీష్,గంగరాజు,సిబ్బంది పాల్గొన్నారు.



