హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తన కొత్త ఇంటెలిజెంట్ యుటిలిటీ వెహికల్ (ఐయూవీ) హ్యుందాయ్ బాయోన్ బుకింగ్స్‌ను ప్రారంభించింది. ‘ఇంటెలిజెన్స్ దట్ మూవ్స్’ అనే తత్వంతో రూపొందించిన ఈ ఎస్‌యూవీని సాంకేతికత, భద్రత, సౌకర్యం, పనితీరు, ఆధునిక డిజైన్‌కు ప్రాధాన్యం ఇస్తూ తీర్చిదిద్దినట్లు కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత డీలర్‌షిప్‌లలో రూ.11,000 ప్రారంభ మొత్తంతో బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించింది.
హ్యుందాయ్ బాయోన్‌లో ఇన్‌బిల్ట్ జెనరేటివ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్ను అందించారు. డ్రైవర్-వాహనం మధ్య సహజమైన పరస్పర చర్యలకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. భారతీయ 5-స్టార్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఇంజనీర్ చేసిన ‘గ్లోబల్ కె ఎన్‌హాన్స్‌డ్ ప్లాట్‌ఫామ్’పై బాయోన్‌ను నిర్మించినట్లు తెలిపింది.
4.2 మీటర్ల పొడవుతో రూపొందించిన ఈ మిడ్‌సైజ్ ఎస్‌యూవీలో స్కల్ప్టెడ్ బోనెట్, ఫ్యూచరిస్టిక్ ఫ్రంట్ ఫాసియా, హెచ్-ఎడ్జ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, జియోమెట్రిక్ వీల్ ఆర్చెస్, ర్యాప్-అరౌండ్ డోర్ క్లాడింగ్, బ్రిడ్జ్-టైప్ రూఫ్ రైల్స్ వంటి డిజైన్ అంశాలను పొందుపరిచారు. విశాలమైన ఇంటీరియర్‌తో ప్రయాణికులకు మెరుగైన లెగ్‌రూమ్, హెడ్‌రూమ్, షోల్డర్ రూమ్ అందించేలా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
బాయోన్‌లో హ్యుందాయ్‌కు చెందిన నిరూపితమైన పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌ను అందించారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మాన్యువల్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (ఐవీటీ) ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. భద్రత, కనెక్టివిటీ, సౌకర్యం, పనితీరుతో పాటు ఆధునిక ఫీచర్లను బాయోన్‌లో అందించినట్లు కంపెనీ వెల్లడించింది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. అధునాతన సాంకేతికత, ఫ్యూచరిస్టిక్ డిజైన్, సమగ్ర భద్రతను ఒకే ఎస్‌యూవీలో అందించే లక్ష్యంతో బాయోన్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఆధునిక భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా స్మార్ట్, కనెక్టెడ్, సహజమైన మొబిలిటీ అనుభవాన్ని అందించడమే దీని ఉద్దేశమన్నారు. హ్యుందాయ్ బాయోన్ డెలివరీ సమయాన్ని వాహనం లాంచ్ సందర్భంగా ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది.



