Wednesday, September 23, 2026
E-PAPER
Homeబీజినెస్ఏఐ+ నోవా 2 పవర్ 5జీ లాంచ్

ఏఐ+ నోవా 2 పవర్ 5జీ లాంచ్

- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్:
ఏఐ+ స్మార్ట్‌ఫోన్‌ సంస్థ తన నోవా 2 సిరీస్‌లో భాగంగా నోవా 2 పవర్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఫ్యాషన్‌, టెక్నాలజీ కలయికను ప్రదర్శిస్తూ న్యూఢిల్లీలో జరిగిన ఫ్యాషన్‌ షోలో ఈ ఫోన్‌ను తొలిసారిగా ఆవిష్కరించారు. సెప్టెంబర్ 24 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ ధర రూ.15,999గా కంపెనీ ప్రకటించింది. నోవా 2 పవర్‌ను ఆధునిక డిజైన్‌, మెరుగైన పనితీరు, దీర్ఘకాలిక బ్యాటరీతో రూపొందించినట్లు సంస్థ తెలిపింది. డ్యూయల్‌-టోన్‌ బ్యాక్‌ ప్యానెల్‌తో బ్లూ గోల్డ్‌ ఫ్యూజన్‌, బ్లూ ఫ్యూజన్‌ రంగుల్లో ఫోన్‌ లభిస్తుంది. అదనంగా ఓషన్‌ గ్రీన్‌, డీప్‌ పర్పుల్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌ రంగుల్లోనూ అందుబాటులో ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ 120Hz డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7100 6nm ప్రాసెసర్‌, 48MP ఏఐ ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్‌ కెమెరా, 13MP ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 6GB+128GB, 8GB+128GB స్టోరేజ్‌ వేరియంట్లు ఉన్నాయి. మైక్రోఎస్‌డీ ద్వారా స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం కల్పించారు. ఫోన్‌లో 7000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. IP65 రేటింగ్‌, డ్యూయల్‌ 5జీ సిమ్‌, వైఫై 6, బ్లూటూత్‌ 5.4 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. నెక్ట్స్‌క్వాంటమ్‌ షిఫ్ట్‌ టెక్నాలజీస్‌ (ఏఐ+ స్మార్ట్‌ఫోన్‌) సీఈఓ మాధవ్‌ షెత్‌ మాట్లాడుతూ.. నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ కేవలం ఫంక్షనల్‌ పరికరం మాత్రమే కాకుండా వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించే సాధనంగా మారిందన్నారు. నోవా 2 పవర్‌లో డిజైన్‌తో పాటు పనితీరు, బ్యాటరీ సామర్థ్యానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.

ధర, లభ్యత: నోవా 2 పవర్‌ 5జీ 6GB+128GB, 8GB+128GB వేరియంట్లలో లభిస్తుంది. బ్యాంక్‌ ఆఫర్‌తో కలిపి ప్రారంభ ధర రూ.15,999గా ఉంది. సెప్టెంబర్‌ 24 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో తొలి విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -