Wednesday, September 23, 2026
E-PAPER
Homeబీజినెస్రోజువారీ పనులకు సంగీత జోష్.. స్పాటిఫై కొత్త ప్రచారం

రోజువారీ పనులకు సంగీత జోష్.. స్పాటిఫై కొత్త ప్రచారం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: రోజువారీ పనులను సంగీతంతో మరింత ఆనందంగా మార్చే లక్ష్యంతో ప్రముఖ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ వేదిక స్పాటిఫై కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ‘రోజ్‌ కే కామ్‌ ఫన్‌ బనావో, స్పాటిఫై చలావో’ పేరుతో చేపట్టిన ఈ ప్రచారంలో రోజువారీ ఇంటి పనులను సంగీతంతో ఆస్వాదించేలా సరదా సన్నివేశాలను రూపొందించారు.

హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, భోజ్‌పురి భాషల్లో మొత్తం ఎనిమిది చిత్రాల సిరీస్‌గా ప్రచారం కొనసాగనుంది. బట్టలు ఇస్త్రీ చేయడం, గిన్నెలు కడగడం, కిటికీలు, నేల శుభ్రం చేయడం, లైట్‌ బల్బ్‌ మార్చడం వంటి సాధారణ పనులను చేస్తూ సంగీతంలో లీనమయ్యే వ్యక్తులను ఇందులో చూపించారు. సంగీతం వినిపించగానే సాధారణ పనులు కూడా సరదాగా మారుతాయనే సందేశాన్ని ఈ ప్రచారం ద్వారా అందిస్తున్నారు.

హైదరాబాద్‌లో సంగీతానికి ఉన్న ఆదరణకు నగరంలోని స్పాటిఫై చార్టులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సెప్టెంబర్‌ 11 నుంచి 17 వరకు హైదరాబాద్‌ టాప్‌ సాంగ్స్‌ చార్టులో అనిరుధ్‌ రవిచందర్‌, జంగీ రెడ్డి, కాసర్ల శ్యామ్‌ల ‘యేషనాగుల’ పాట మొదటి స్థానంలో నిలిచింది. ‘మల్లెపూల పల్లకి’, ‘నేనో బటర్‌ఫ్లై’ పాటలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ‘ఆయా షేర్‌’, ‘యాలలో యాల’, ‘చికిరి చికిరి’, ‘కళ్యాణి’, ‘ఇరుముడి కట్టు’, ‘గాలి వాలుగా’, ‘చమికి’ వంటి పాటలు కూడా చార్టులో చోటు దక్కించుకున్నాయి.

స్పాటిఫై నిర్వహించిన పరిశోధనలో 97 శాతం మంది భారతీయ వినియోగదారులు తమ సాధారణ పనులను మరింత ఆనందంగా మార్చేందుకు సంగీతం ఉపయోగపడుతుందని పేర్కొన్నట్లు సంస్థ తెలిపింది. 98 శాతం మంది తమ దినచర్యలో స్పాటిఫై ముఖ్యమైన భాగమని, 71 శాతం మంది స్పాటిఫై వినియోగిస్తున్నప్పుడు ప్రశాంతంగా, రిలాక్స్‌గా అనిపిస్తుందని వెల్లడించినట్లు పేర్కొంది.

స్పాటిఫై ఇండియా మార్కెటింగ్‌ హెడ్‌ షిప్రా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. సంగీతం ఒక క్షణం అనుభూతిని మార్చగలదని అన్నారు. ఇంటి పనులు, రోజువారీ కార్యకలాపాలకు సంగీతాన్ని జోడించడం ద్వారా సాధారణ క్షణాలను కూడా ఆనందంగా మార్చుకోవచ్చని తెలిపారు.

స్పాటిఫై తాజా ‘లౌడ్‌ అండ్‌ క్లియర్‌’ నివేదిక ప్రకారం.. 2025లో భారతీయ కళాకారుల పాటలను శ్రోతలు స్పాటిఫైలో దాదాపు 335 బిలియన్‌ సార్లు స్ట్రీమ్‌ చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఇది 20 బిలియన్‌ గంటలకు పైగా సంగీతానికి సమానమని తెలిపింది. తెలుగు కళాకారుల రాయల్టీలు ఏడాదికి ఏడాది 120 శాతానికి పైగా పెరిగినట్లు పేర్కొంది.

టీవీ, డిజిటల్‌, సోషల్‌ మీడియా వేదికల్లో ఐదు వారాల పాటు ఈ ప్రచారం కొనసాగనుంది. సంగీతం రోజువారీ జీవితంలో భాగంగా మారిందనే సందేశాన్ని ఈ ప్రచారం ద్వారా అందిస్తున్నట్లు స్పాటిఫై తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -