Thursday, September 24, 2026
E-PAPER
Homeజాతీయంమధ్యతరగతికి ఆదాయం లేదు..

మధ్యతరగతికి ఆదాయం లేదు..

- Advertisement -

ఉద్యోగాలు తగ్గుతున్నాయ్.. వేతనాలూ అంతంతే
అప్పులతో నడుస్తున్న ఆర్థిక బండి
ఖర్చులు పైపైకి.. ఆదాయంలో స్తబ్దత
పెరుగుతున్న 
సంపన్నుల సంపద
ప్రజా సేవలకు నై..
 నగదు బదిలీలకు సై
కేంద్రం తీరుతో దేశ ఆర్థిక విధానాలపై ఆందోళన


మోడీ సర్కారు పాలనలో 
ఆర్థిక వృద్ధి గణాంకాలు పేరుకే వెలిగిపోతున్నాయి. కానీ దేశంలోని సామాన్య భారతం పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. మధ్యతరగతి కుటుంబాల ఆదాయాలు అంతగా పెరగకపోగా.. 
విద్య, వైద్యం, రవాణా, 
రోజువారీ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కుటుంబాల వినియోగాన్ని ఇప్పుడు ఆదాయం కాకుండా అప్పులే నడిపిస్తున్నాయి. మరోవైపు సంపన్న వర్గం సంపద వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వ సేవల స్థానంలో నగదు బదిలీలపై ఆధారం పెరుగుతున్న తీరు.. దేశ ఆర్థిక విధానాలపై కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

న్యూఢిల్లీ: మోడీ పాలనలో భారత మధ్యతరగతి ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగజారిపోతోంది. ఒకప్పుడు ఉద్యోగం, వేతనం పెరిగితే కుటుంబ వినియోగం పెరిగేది. ఇప్పుడు ఆదాయం పెరగక పోయినా ఖర్చులు మాత్రం ఆగడం లేదు. ఫలితంగా రుణాలు తీసుకుని జీవన అవస రాలను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడు తోంది. ఇదే సమయంలో దేశంలో అత్యంత సంపన్న వర్గం సంపదను వేగంగా పెంచు కుంటూ అధిక విలువైన ఇండ్లు, కార్లు, ఇతర వస్తువుల కొనుగోళ్లను పెంచుతోంది. ఇది జీవన నాణ్యతా ప్రమాణాలపై ప్రశ్నలు సంధిస్తోంది.

మధ్యతరగతి మార్కెట్‌ బలహీనం
గత రెండు దశాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థకు మధ్యతరగతి వినియోగమే ప్రధాన వనరుగా నిలిచింది. షాంపూ, ప్యాకేజ్డ్‌ ఆహారం నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లు, ఏసీల వరకు మార్కెట్‌ విస్తరించింది. ఇప్పు డు ఆ వినియోగ శక్తి మందగిస్తోంది. ఫాస్ట్‌ మూవింగ్‌ కన్య్సూమర్‌ గూడ్స్‌( ఎఫ్‌ఎంసీజీ) ఉత్పత్తుల పరిమాణ విక్రయాల వృద్ధి 2011లో 11-12 శాతం ఉండగా.. 2026లో కేవలం మూడు శాతానికి పడిపోయింది. వినియోగ వస్తువుల వృద్ధి కూడా రెండంకెల స్థాయి నుంచి మధ్యస్థ అంకెలకు చేరింది.

ఉద్యోగాలే కీలక సమస్య
మోడీ పాలనలో దేశంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగింది. భారత్‌లో ఏటా సుమారు 80 లక్షల మంది కొత్తగా ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. కానీ పూర్తి స్థాయి వైట్‌కాలర్ ఉద్యోగాలు అందుతున్నది చాలా కొద్దిమందికే. అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం నాలుగు శాతం మందికే పూర్తి స్థాయి వైట్‌కాలర్ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఐటీ, బీపీఓ రంగాల్లో ఉద్యోగ ప్రకటనలు తగ్గడం, కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావం పెరగడం వల్ల వైట్‌కాలర్ ఉద్యోగాలపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఇది కేంద్రంలోని మోడీ ప్రభుత్వ బలహీన విధానాల కారణంగా నేనని విశ్లేషకులు చెప్తున్నారు.

సంపన్నుల ఎదుగుదల
మరోవైపు దేశంలో కొత్త ధనిక వర్గం వేగంగా ఎదుగుతోంది. చిన్న, మధ్య తరహా నగరాల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలు సాంకేతికత ఆధారంగా భారీగా సంపద సృష్టిస్తున్నారు. దాని ప్రభావం రియల్ ఎస్టేట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. రూ.1.5 కోట్లలోపు ఇండ్ల వాటా 2022 తొలి త్రైమాసికంలో 85 శాతం ఉండగా.. 2026 తొలి త్రైమాసికానికి 47 శాతానికి పడిపోయింది. రూ.1.5 కోట్ల నుంచి రూ.4 కోట్ల మధ్య ఇండ్ల వాటా మాత్రం 14 శాతం నుంచి 44 శాతానికి పెరిగింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో సంపన్నుల ఎదుగుదల ఏ విధంగా జరుగుతోందో ఇది తెలియజేస్తోంది. ప్రయివేట్ తుది వినియోగ వ్యయం 2025 ఆర్థిక సంవత్సరంలోని 5.8 శాతం నుంచి 2026లో 7.7 శాతానికి పెరిగింది. 2026-27 తొలి త్రైమాసికంలో ఇది 7.1 శాతంగా నమోదైంది. అయితే ఈ పెరుగు దల వెనుక కుటుంబ ఆదాయాల కంటే రుణాల విస్తరణ ముఖ్యమైన కారణం గా మారింది. వాహన రుణాలు 18.8 శాతం పెరగగా.. బంగారు రుణాలు ఏకంగా 88.1 శాతం పెరిగాయి. అదే సమయంలో క్రెడిట్ కార్డు బకాయిల వృద్ధి 2.3 శాతానికి, వినియోగ వస్తువుల రుణాల వృద్ధి 0.4 శాతానికి తగ్గింది. అంటే ప్రజలు ఖర్చు చేయడం ఆపలేదు.. కానీ ఆ ఖర్చుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తోందన్నదే అసలు ప్రశ్న.

నగదు బదిలీల వైపు ప్రభుత్వాలు
ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితిపైనా ఒత్తిడి పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ వడ్డీ చెల్లింపులు 2026-27 బడ్జెట్‌ అంచనాల ప్రకారం రూ.14.04 లక్షల కోట్లకు చేరాయి. ప్రభుత్వ ఆదాయంలో సింహ భాగం వడ్డీ చెల్లింపులకే వెళ్తున్న నేపథ్యంలో ప్రజా సేవలపై ఖర్చు చేయడం తగ్గుతోంది. మరోవైపు మహిళలు, తక్కువ ఆదాయ వర్గాలకు నగదు బదిలీ చేసే పథకాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. తక్షణ ఆర్థిక సహాయం అందించడం ద్వారా పేద కుటుంబాలకు తాత్కాలికంగా ఉపశమనం లభిస్తున్నా.. అది దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇక ప్రజలకు కీలకమైన ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, ఉపాధి అవకాశాలను బలోపేతం చేయడంలో మాత్రం మోడీ సర్కారు అంతగా శ్రద్ధ చూపడం లేదు.

ఎవరి చేతుల్లో వినియోగం?
భారత వినియోగ వ్యవస్థలో ఇప్పుడు స్పష్టమైన విభజన కనిపిస్తోంది. పైస్థాయిలో సంపన్నుల ఖర్చులు పెరుగుతున్నాయి. ఇటు మధ్యతరగతి రుణాలపై ఆధారపడుతోంది. దిగువ ఆదాయ వర్గాలకు నగదు బదిలీలు ఆధారంగా మారుతున్నాయి. ఉద్యోగాలు, వేతనాలు, ప్రజా సేవలు బలపడకుండా వినియోగ వృద్ధి కొనసాగితే.. ఆ వృద్ధి స్థిరమైందని చెప్పలేమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అప్పులతో వినియోగం
మధ్యతరగతి కుటుంబాల ఖర్చులు మాత్రం ఆదాయంతో సరిపోలడం లేదు.
 విద్య, వైద్యం, రవాణా, ఇల్లు,
 రోజువారీ అవసరాల ఖర్చులు పెరుగుతున్నాయి. దానికి 
అనుగుణంగా ఆదాయం అంతగా పెరగడం లేదు. దీంతో కుటుంబాలు రుణాల కోసం ఎదురుచూస్తున్నాయి. అప్పుల మీద ఆధారపడటంతో భవిష్యత్తు సంక్లిష్టమవుతోంది. దేశంలో గృహ రుణాలను మినహాయించిన కుటుంబ రుణభారం జీడీపీలో ప్రపంచంలోనే అత్యధిక స్థాయికి చేరిందని గణాంకాలు సూచిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -