Thursday, September 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళలు, మైనర్ బాలికలపై 
పెరిగిన దాడులు

మహిళలు, మైనర్ బాలికలపై 
పెరిగిన దాడులు

- Advertisement -


ఐద్వా ఖండన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

దేశంలో ​ ​మహిళలు, మైనర్ బాలికలపై పెరుగుతున్న క్రూరమైన దాడులను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. న్యూఢిల్లీలోని ఆస్థా కుంజ్ పార్కులో 17 ఏండ్ల బాలికపై జరిపిన సామూహిక లైంగిక దాడితో పాటు, ఒడిశాలో యువ జంటపై అల్లరి మూకల దౌర్జన్యం, బీహార్‌లో పాఠశాల విద్యార్థినిపై జరిగిన వేధింపుల ఘటనల పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ​దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌కు చెందిన మైనర్ బాలికపై పార్కులో పోలీసులమని చెప్పి అక్రమంగా బంధించి, తుపాకీతో బెదిరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడటం అత్యంత ఘోరమైన, అమానుషమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ నెలలో 14 ఏండ్ల బాలికపై తీవ్రమైన లైంగికదాడి, హత్య, 10 ఏండ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి వంటి వరుస ఘటనలు చోటుచేసుకోవడం దేశంలో మహిళలు, బాలికల భద్రత ఎంతగా దిగజారిందో స్పష్టం చేస్తోందని విమర్శించారు. అలాగే ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలో పర్యాటక ప్రాంతానికి వెళ్తున్న యువ జంటపై గుంపుగా దాడి చేసి వేధించడం, బీహార్‌లోని జముయిలో పదో తరగతి బాలికను నిరంతరం వేధింపులకు గురిచేయడం లాంటి సంఘటనల పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనలు చట్టబద్ధమైన పాలనపై, మహిళల ప్రాథమిక హక్కులపై తీవ్ర దాడికి నిదర్శనమని మండిపడ్డారు. ఫరీదాబాద్, ఒడిశా, బీహార్ ఘటనల్లోని నిందితులందరిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వేగవంతమైన విచారణ జరిపి కఠిన శిక్షలు అమలు చేయాలని కోరారు. ​పార్కులు, పర్యాటక ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలలో మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని గుర్తుచేశారు. ​ మహిళలపై జరుగుతున్న వరుస దాడులను అరికట్టడంలో విఫలమైన పోలీసు, సంబంధిత అధికార యంత్రాంగంపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -