- Advertisement -
నవతెలంగాణ-నవాబుపేట్
మండల పరిధిలోని హన్మాసానిపల్లె గ్రామానికి చెందిన యువకుడు గ్రామం నుండి మహబూబ్‌నగర్ కు మోటార్ సైకిల్ పై కాలేజీకు వెళ్తుండగా మార్గమధ్యలో తన మొబైల్ ఫోన్ ని పోగొట్టుకున్నారు. మొబైలు ఖరీదు రూ.25000/- ఉంటుందనీ, ఐఎంఈఐ నంబర్ తో పాటు నవాబుపేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా బాధితుని ఫోన్ ను జడ్చర్లలో ట్రేస్ చేసి గురువారం బాదితుడికి అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరెందర్ మాట్లాడుతూ.. ఎవరైనా తమ యొక్క మొబైల్ ఫోన్ ని పోగొట్టుకున్న లేదా ఎవరైనా దొంగిలించిన వెంటనే సిఇఐఆర్ పోర్టల్ లో తమ ఫోన్ యొక్క వివరాలు నమోదు చేయవలసిందిగా కోరారు.
- Advertisement -



