- ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ
నవతెలంగాణ-హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే సర్ సర్వే పై కేంద్ర ఎన్నికల కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయని జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చాయి. దీంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై ప్రతిపక్షాలు తమ విమర్శలను తీవ్ర తరం చేశాయి. తాజాగా బీజేపీ, చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ లపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓట్లను దొంగిలిస్తున్నారని, దీనివల్ల ఎంపీలు చేసిన చట్టాలు చట్టవిరుద్ధం అవుతాయని ఆయన అన్నారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో గాంధీ మాట్లాడుతూ..కుమార్‌ను దేశద్రోహిగా అభివర్ణించారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం “నాశనం అవుతుంటే” కాంగ్రెస్ మౌనంగా చూస్తూ ఉండదని హెచ్చరించారు.



