Homeబీజినెస్సెక్యూర్డ్ అడ్వాంటేజ్ ఎస్‌బిఐ కార్డ్ ను ప్రారంభించిన ఎస్‎బిఐ కార్డ్..

సెక్యూర్డ్ అడ్వాంటేజ్ ఎస్‌బిఐ కార్డ్ ను ప్రారంభించిన ఎస్‎బిఐ కార్డ్..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : భారతదేశపు అతిపెద్ద ప్యూర్-ప్లే క్రెడిట్ కార్డ్ జారీచేసే ఎస్‎బిఐ కార్డ్ ఈరోజు ఎస్‎బిఐ యోనో పై అడ్వాంటేజ్ ఎస్‎బిఐ కార్డ్ ను ప్రకటిస్తూ, ఫిక్స్డ్ డీపాజిట్ ఆధారిత సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అందుకోవటానికి వీలుగా వినియోగదారులకు అంతరాయంలేని డిజిటల్ ప్రయోజనాన్ని ప్రవేశపెట్టింది. ఈ డిజిటల్ ప్రయాణాన్ని శ్రీ. చల్లా శ్రీనివాసులు శెట్టి, చైర్మన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‎బిఐ) ప్రారంభించారు. ఈ కార్యక్రమములో శ్రీ. అశ్విన్ కుమార్ తివారి, మేనేజింగ్ డైరెక్టర్, ఎస్‎బిఐ, మరియు శ్రీమతి. సలిల పాండే, మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్, ఎస్‎బిఐ కార్డ్ కూడా పాల్గొన్నారు. ఎస్‎బిఐ యోనో పై సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ కొరకు సంపూర్ణ డిజిటల్ ప్రయాణము ఒక నిరంతరాయ మరియు సౌకర్యవంతమైన డిజిటల్ అనుభవము ద్వారా వినియోగదారుడికి క్రెడిట్ ప్రాప్యతను బలోపేతం చేస్తుంది. వినియోగదారులు ఎస్‎బిఐ యోనో పై – ఎస్‎బిఐ కార్డ్ ఎలైట్, ఎస్‎బిఐ కార్డ్ ప్రైమ్, సింప్లీక్లిక్ ఎస్‎బిఐ కార్డ్ మరియు సింప్లీసేవ్ ఎస్‎బిఐ కార్డ్ అనే నాలుగు సెక్యూర్డ్ అడ్వాంటేజ్ ఎస్‎బిఐ కార్డ్స్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ప్రారంభము సులభమైన మరియు మెరుగైన వినియోగదారు అనుభవాన్ని అందించుటకు ఎస్‎బిఐ నెట్వర్క్ మరియు యోనో ప్లాట్ఫార్మ్ యొక్క డిజిటల్ సామర్థ్యాలతో ఎస్‎బిఐ కార్డ్ యొక్క విశ్వసనీయమైన క్రెడిట్ కార్డ్ నైపుణ్యాన్ని కలుపుతుంది. ఎస్‎బిఐ లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్న వినియోగదారులు ఎస్‎బిఐ యోనో పై 100% పేపర్‎లెస్ ప్రయాణము ద్వారా సెక్యూర్డ్ అడ్వాంటేజ్ ఎస్‎బిఐ కార్డ్ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రయత్నము ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క సురక్షతను క్రెడిట్ కార్డ్ యొక్క సౌకర్యము మరియు ప్రయోజనాలతో కలపడం ద్వారా వినియోగదారులు తమ రోజువారి ఖర్చుల కోసం అత్యంత లాభదాయకమైన అనుభవాన్ని పొందవచ్చు.

సలిల పాండే, మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్, ఎస్బిఐ కార్డ్, ఇలా అన్నారు, ఒక నిరంతరాయ, 100% పేపర్లెస్ డిజిటల్ ప్రయాణము ద్వారా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ అందుకొనుటకు వినియోగదారులు ఇప్పుడు ఒక సరళమైన మరియు మరింత సౌకర్యవంతమైన విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎస్బిఐ యోనో పై అడ్వాంటేజ్ ఎస్బిఐ కార్డ్ కొరకు ప్రక్రియలో మరింత సౌలభ్యాన్ని అందించుటకు కొత్త డిజిటల్ ప్రయాణము రూపొందించబడింది. దీని వలన వినియోగదారులు నిమిషాలలోనే ఫిక్స్డ్ డిపాజిట్ ఆధారిత సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ ను అందుకోగలుగుతారు. ఎస్బిఐ యోనో పై ఎస్బిఐ క్రెడిట్ కార్డ్స్ యొక్క వైవిధ్యమైన పోర్ట్ఫోలియో వినియోగదారులకు వారి అవసరాలకు సరిపోయే ప్రతిపాదనను ఎంచుకునే అనుకూలతను అందిస్తుంది. ఎస్బిఐ కార్డ్ వద్ద మేము వినియోగదారుల కొరకు అనుభవాలను సరళీకృతం చేయడం మరియు ప్రతి పరస్పర చర్య సులభతరం మరియు అర్థవంతం చేయాలనే మా ప్రయత్నముతో, వినియోగదారుడి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడమే మా లక్ష్యముగా ఉంది.”

ఎస్‎బిఐ యోనో పై సెక్యూర్డ్ అడ్వాంటేజ్ ఎస్‎బిఐ కార్డ్ అధికారిక క్రెడిట్ ఎకోసిస్టమ్ కు సులభంగా ప్రవేశించగలిగిన మార్గాన్ని అందిస్తుంది, ముఖ్యంగా తమ క్రెడిట్ ప్రొఫైల్ ను బలోపేతం చేసుకోవాలని చూసే వినియోగదారుల కొరకు. ఈ ప్రారంభము అధికారిక క్రెడిట్ కు ప్రాప్యతను విస్తరించుటకై డిజిటల్-ఫస్ట్ వినియోగదారు ప్రయాణాలను ఏర్పాటు చేయడము పై ఎస్‎బిఐ కార్డ్ యొక్క లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తుంది. వినియోగదారుడి ఆకాంక్షలు సులభమైన, తక్షణ మరియు సమగ్ర ఆర్ధిక అనుభవాల వైపుకు మారుతుండగా, ఎస్‎బిఐ కార్డ్ రోజువారి ఆర్ధిక పరస్పర చర్యలను మరింత సౌకర్యవంతంగా చేసే సాంకేతిక-ఆధారిత పరిష్కారాలకై కృషి చేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -