- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఈనెల 26 న జరిగే వీరనారి చిట్యాల ఐలమ్మ131వ జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా మండల కేంద్రానికి చెందిన పగడాల లింగయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవ కమిటీలో ప్రభుత్వం తనకు చోటు కల్పించడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమం విజయవంతంగా జరుగుటకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా ఎన్నికైనందుకు లింగయ్య ను పలువురు అభినందించారు.
- Advertisement -



