Homeతెలంగాణ రౌండప్మృతుల కుటుంబాలకు పరామర్శ

మృతుల కుటుంబాలకు పరామర్శ

- Advertisement -

జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ దొంతుల శ్రీనివాస్
నవతెలంగాణ – టేకుమట్ల

మండలంలోని రామకృష్ణపూర్ (వి) గ్రామానికి చెందిన లద్దునూరి సమ్మక్క, ఏంపేడు గ్రామానికి చెందిన బొల్లి రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మేరకు శుక్రవారం వారి కుటుంబాలను జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దొంతుల శ్రీనివాస్ పరామర్శించి, మాతృశ్రీ ఫౌండేషన్ తరఫున 25 కిలోల బియ్యం బస్తాలను అందజేశారు. అనంరత ఆయన మాట్లాడుతూ.. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో రాఘవాపూర్ సర్పంచ్ అంబాల కిరణ్, మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు లద్దునూరి ఐలయ్య, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు ఆరకొండ రాజయ్య, మండల ఎస్సీ సెల్ నాయకులు పారణంది రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -