- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో వల్లెంకుంట గ్రామపరిధిలోని శాలపల్లె మడక బాలమ్మ ఇంటి గోడ కూలిపోయి ఇల్లు పాక్షికంగా దెబ్బతిందని బాధితురాలు వాపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ బొమ్మ రజిత-రమేష్ రెడ్డి, ఉపసర్పంచ్ కటకం సప్న-నరేష్, పంచాయతీ కార్యదర్శి మధుకర్ రెడ్డి పరిశీలించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి గాండ్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



