నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్ అండ్ కళాశాలలో విద్యనుభ్యసిస్తున్న విద్యార్థులు రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎన్నికైనట్టు కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ పూర్ణచంద్రరావు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ఈనెల 26,27 తేదీలలో హన్మకొండ జిల్లాలోని జేఎన్ఎస్ స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు కళాశాలకు చెందిన బండి గణేష్, కొడారి హిమజ, షాట్ పుట్ విభాగంలో పుట్ట సంకీర్తన, లాంగ్ జంప్ లో పోలం నిత్య 100 మీటర్ల పరుగు పందెంలో జిల్లా తరఫున రాష్ట్రస్థాయిలో ప్రాతినిధ్యం వహించనున్నారని తెలిపారు. ఈ క్రీడలకు ఫిజికల్ డైరెక్టర్ పక్కల రాజబాబు, కోచ్ హాట్కార్ రఘువీర్ మేనేజర్ లావుడ్యా సారయ్యలు క్రీడాకారులకు మేలుకోలు నేర్పి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు క్రీడాకారులతో పాటు వీరిని కూడా పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయ బృందం, కళాశాల ప్రిన్సిపల్ అభినందించారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా అవసరమన్నారు. పాఠశాలలో చదువుతోపాటు ఆటలకు సోషల్ ఆక్టివిటీస్కు ఎంతో ప్రాధాన్యం ఉంటుందన్నారు.
తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



